గ్రామ గ్రామాన పంచాయతీ రాజ్ దినోత్సవం
MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పంచాయతీ దినోత్సవాన్ని సర్పంచులు కార్యదర్శులు నిర్వహించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దండేపల్లి మండలంలోని దండేపల్లి, నంబాల, ద్వారక, గుడిరేవు, తాళ్లపేట, లింగాపూర్, కొల్విచెల్మ, తదితర అన్ని పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించారు.