గ్రామాభివృద్ధికి బాధ్యతగా పనిచేయాలి: ఎమ్మెల్యే

గ్రామాభివృద్ధికి బాధ్యతగా పనిచేయాలి: ఎమ్మెల్యే

NZB: మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి నూతన సర్పంచులకు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంగళవారం వేల్పూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యలను తీర్చే విధంగా బాధ్యతగా పనిచేయాలని వారికి స్పష్టం చేశారు.