డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక DY CM డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలగాల్సిన రావొచ్చన్నారు. తను పదవిలో కొనసాగాలా వద్దా? అనేది ముఖ్యం కాదన్నారు. పదవిలో శాశ్వతంగా తాను ఉండలేనని.. ఇతరులకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. తాను ఆయన నాయకత్వంలోనే ముందుకెళ్తానని.. దీనికి ఎవరూ చింతించొద్దని తెలిపారు.