టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవికి అభినందనలు

గుంటూరు: జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన గళ్లా మాధవిని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు, కన్నా మాస్టర్, నాగమల్లేశ్వరరావు గురువారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచి నూతనంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న ఆమెకు బీసీ సంక్షేమ సంఘం నేతలు అభినందనలు తెలిపారు.