వైద్యురాలికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు

వైద్యురాలికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు

NLG: కనగల్‌కు చెందిన సామాజిక సేవకురాలు, గ్రామీణ వైద్యురాలు కంబాల శివలీల 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అవార్డు అందుకున్నారు. రవీంద్రభారతిలో మనం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, పాలకొల్లు పీఠారెడ్డి తదితర ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారం ప్రదానం చేశారు. ఆమె చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి సంస్థ అవార్డును అందించింది.