రావాల్సిన యూరియాను కేంద్రం విడుదల చేయాలి: ఎంపీ

MHBD: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 3.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ హౌస్ బయట తెలంగాణ ఎంపీలు సోమవారం నిరసన తెలిపారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సరిపడా యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కేంద్రం స్పందించి యూరియా విడుదల చేయాలని కోరారు.