ఆక్సిజన్ అందక 5 రోజుల పసికందు మృతి
అనకాపల్లిలోని NTR ఆసుపత్రి ముందు ఉద్రికత్త చోటుచేసుకుంది. ఆక్సిజన్ లేకపోవడంతోనే తమ 5 రోజుల పసికందు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పుట్టిన బాబుకు పచ్చ కామెర్లు ఉన్నాయని సిబ్బంది స్పెషల్ వార్డుకు తరలించారు. అయితే స్పెషల్ వార్డులో కరెంట్ లేకపొవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బాలుడు చనిపోయాడు అని వారు ఆరోపించారు.