వేసవి వేళ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

వేసవి వేళ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

SS: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో భాగంగా ధర్మవరం నుంచి హెచ్ఎస్ నాందేడ్‌కు ప్రత్యేక రైలును నడపనున్నారు. రైలు నంబర్ 07190 ధర్మవరం నుంచి ఈనెల 12వ తేదీ ఆదివారం బయలుదేరుతుంది. అలాగే నాందేడ్ నుంచి ధర్మవరానికి (07189) ఈనెల 10న రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.