కాలువల నిర్లక్ష్యం... ప్రజలకు నరకం..!
విజయనగరం: రాజాం పట్టణంలోని గొల్లవీధిలో రహదారి అధ్వాన్నంగా మారింది. కాలువల పూడికలను పూర్తిగా తొలగించకపోవడంతో మురుగు నీరు రోడ్లపై చేరి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. దుర్వాసన, దోమల సమస్యతో పాటు రోగాల భయం పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు