వైసీపీ ర్యాలీలో పాల్గొన్న జిల్లా నేతలు
సత్యసాయి: జిల్లా కేంద్రంలో సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ, హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ కూడా పాల్గొన్నారు. అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వరకు ర్యాలీ కొనసాగింది.