రాజనగరం శ్రీరామకృష్ణేశ్వర రథోత్సవం నేడు
వనపర్తి మండలం రాజనగరంలోని శ్రీ రామకృష్ణేశ్వర స్వామి జాతరలో భాగంగా బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా రథోత్సవం జరుగనుంది. బ్రాహ్మణ వీధిలో తేరును అలంకరించి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాత్రి భక్తులు తేరు లాగనున్నారు. గతంలో రాజనగరం–నాగవరం మధ్య జరిగే జాతర ఇప్పుడు రాజనగరంలోనే జరుగుతోందని, అయితే పూర్వ వైభవం కొంత తగ్గిందని గ్రామస్థులు తెలిపారు.