ఎల్లుండి ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. సీఎం రాక సందర్భంగా పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. 7న ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రావడం ఒక విశేషమైతే.. సరిగ్గా రెండేళ్ల క్రితం డిసెంబర్ 7, 2023న LB స్టేడియంలో ఆయన CMగా ప్రమాణ స్వీకారం చేశారు.