పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

NRPT: మద్దూరు పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ తనిఖీ చేశారు. రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. కేసుల వివరాలను ఎస్ఐ విజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలని, సైబర్ నేరాలు, చోరీల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.