అమెరికా గోల్డ్ కార్డ్ ఎంతంటే?
అమెరికా గోల్డ్ కార్డ్ వీసా విక్రయాలు ప్రారంభించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ఇది గ్రీన్ కార్డు లాంటిదే.. కానీ చాలా పెద్ద ఉపయోగాలు ఉంటాయని పేర్కొన్నారు. 5 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 43 కోట్లు) చెల్లించి ఈ కార్డ్‌ను తీసుకోవచ్చు. దీంతో నేరుగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది.