ఆసుపత్రి విస్తరణపై టీడీపీ నేతల ఆనందం

ఆసుపత్రి విస్తరణపై టీడీపీ నేతల ఆనందం

SKLM: టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల నుంచి 200 పడకలకు అప్‌ గ్రేడ్ చేసినందుకు గురువారం ఆసుపత్రి ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. టెక్కలికి మాత్రమే కాకుండా సమీప మండలాల ప్రజలకు కూడా ఈ నిర్ణయం లాభదాయకం కానుంది అని అన్నారు.