ఎట్టకేలకు బుక్కాపురంనికి పల్లె వెలుగు బస్సు

ఎట్టకేలకు బుక్కాపురంనికి పల్లె వెలుగు బస్సు

NLR: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో వింజమూరు మండలం బుక్కాపురం గ్రామానికి పల్లె వెలుగు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ బస్సు ఉదయం, సాయంత్రం రెండు పర్యాయాలు నడుస్తుంది. బుధవారం బుక్కాపురం గ్రామానికి చేరుకున్న బస్సుకు ఘనంగా పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి అధికారులు ప్రారంభించారు. దీంతో గ్రామవాసుల చిరకాల కల నెరవేరింది.