వినతులను స్వీకరించిన ఎస్పీ
ELR: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన ఫిర్యాదులను సంబంధిత అధికారాలు త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.