ఆరు రోజులు మాత్రమే మిగిలింది...!

NLG: మున్సిపాలిటీలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లిస్తే ఐదు శాతం రాయితీ కల్పించింది. అయితే ఆ గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. గత ఆర్థిక సంవత్సరంలో బకాయిలపై 90 శాతం రాయితీ కల్పించినప్పటికీ ఆశించినంత వసూలు కాలేదు. అదే విధంగా ప్రభుత్వం ఈనెల 30వరకు ఆస్తి పన్నుల వసూళ్లపై 5శాతం రాయితీని కల్పిస్తూ మరో సారి అవకాశాన్ని కల్పించింది. అందుకు 6రోజులు మాత్రమే మిగిలింది.