పుట్టపర్తికి పెరిగిన భక్తుల తాకిడి

పుట్టపర్తికి పెరిగిన భక్తుల తాకిడి

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి రైలు, బస్సుల్లో పట్టాణానికి చేరుకుంటున్నారు. దీంతో పుర వీధులు, ప్రశాంతి నిలయం ఆవరణ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులకు మూడు పూటలా భోజన వసతి, వైద్య సేవలు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.