VIDEO: కాలువలో ఆంబోతు కళేబరం.. తీవ్ర దుర్వాసన
కోనసీమ: అమలాపురం మండలం కామనగరువు నుంచి చల్లపల్లి వెళ్ళే పంటకాలువలో శనివారం కుళ్ళిపోయిన ఆంబోతు కళేబరం తేలింది. దీంతో తీవ్ర దుర్గంధం రావడంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. స్కూల్ వద్ద అడ్డుపడి ఉండిపోవడంతో విద్యార్థులు వాసన భరించలేక సతమతం అయ్యారు. దానిని పారిశుధ్య కార్మికులు సమనస లాకుల వరకు గెంటారు.