VIDEO: కాణిపాకంలో వైభవంగా విమానోత్సవం

CTR: కాణిపాకం వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విమానోత్సవం నిర్వహించారు. ఈ మేరకు వాహనంపై పార్వతీ పుత్రుడు కాణిపాక పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారి ఉత్సవాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శనివారం రాత్రి పుష్ప పల్లకి సేవ నిర్వహించినట్లు ఆలయ ఈవో తెలిపారు.