ఈనెల 11 పలు రైళ్లు రద్దు

SKLM: సంతబొమ్మాళి మండలం కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ నుంచి ఈనెల 11వ తేదీన సుమారు 10 రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్‌లో విద్యుదీకరణ పనుల కారణంగా గుణుపూర్-విశాఖ, బ్రహ్మపుర-విశాఖ, భువనేశ్వర్- విశాఖ, మెమూ ప్యాసింజర్, బ్రహ్మపుర-విశాఖకు వెళ్లే 10 రైళ్లను రద్దు చేశామన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.