ఇకపై సంక్షేమం, అభివృద్ధి సులువు: పవన్

ఇకపై సంక్షేమం, అభివృద్ధి సులువు: పవన్

AP: పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్కరణలో భాగంగా 77 డివిజన్ డెవలప్‌మెంట్ ఆఫీసులను ప్రారంభించడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 'ఈ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రజలకు సేవలందించడానికి, సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సులువుగా అమలు చేసే అవకాశం ఉంటుంది' అని వెల్లడించారు.