కొండపాక లో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి!
SDPT: కొండపాక వద్ద కారు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో భార్యా భర్తలు ప్రాణాలు కోల్పోయారు. సింగరేణి ఉద్యోగి అబ్దుల్ రఫీ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆయన భార్య మల్దూర్ బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రోడ్డు మరమ్మతుల వల్ల వన్వే అమలులో ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.