అన్నదాత మధుకు పురస్కారం

NLR: కావలి పట్టణానికి చెందిన గ్రామీణ వైద్యులు దామ మధుసూదన రావుకి శనివారం చిలకలూరిపేటలోని కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ మెడికల్ అసోసియేషన్‌లో అరుదైన గౌరవం దక్కింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జయ జయ సాయిట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి బాలాజి చేతులమీదుగా ఉత్తమ జాతీయ ప్రజా సేవా రత్న పురస్కారాన్ని అందజేశారు.