ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు
KNR: జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. కరీంనగర్ MP, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కోసం రూ. 1 కోటి 50 లక్షలతో వైద్య పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. ఈ పరికరాలను ప్రారంభించేందుకు మంత్రి బండి సంజయ్ రేపు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రారంభించనున్నారు.