గల్లంతైన మత్స్యకారుడు

గల్లంతైన మత్స్యకారుడు

WGL: జిల్లాలోని కాజీపేట శివారులో గల వడ్డేపల్లి చెరువులో రొయ్యలు పట్టడానికి వెళ్లిన కల్లెబోయిన క్రాంతికుమార్ (40) అనే మత్స్యకారుడు గల్లంతయ్యారు. క్రాంతికుమార్ వడదెబ్బకు గురై పడవలో నుంచి నీటిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. తోటి మత్స్యకారులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. నిన్న సాయంత్రం వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటనపై పూరి సమాచారం తెలియాల్సి ఉంది.