అఖండ 2 ఫస్ట్ డే కలెక్షన్స్!
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అఖండ 2. ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్‌పై నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. కేవలం బుక్ మై షోలో గంటకు 20 వేల టికెట్లు బుక్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.65 నుంచి 80 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.