KCR, హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురు

TG: KCR, హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఆ నివేదికపై ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. KCR, హరీష్‌రావు MLAలుగా ఉన్నందున అసెంబ్లీలో చర్చించాలని సూచించింది. చర్చ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది. కమిషన్ రిపోర్ట్ ఎక్కడైనా అప్‌లోడ్ చేసి ఉంటే తొలగించాలని ఆదేశించింది.