మంగళవారం: నేటి తిరుమల సమాచారం
TPT: తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6గంటల సమయం పడుతుండగా, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2-3గంటల సమయం పడుతోంది. 7కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,294 మంది భక్తులు దర్శించుకోగా.. 26,796 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.