'మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయం'
SKLM: గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం సంతబొమ్మాలి మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు బోరుభద్ర పంచాయతీ గోదలాం నుండి కొల్లిపాడు వరకు బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో జేసీ ఫార్మన్ అహ్మద్ ఖాన్, అధికారులు, నాయకులు ఉన్నారు.