బాధిత కుటుంబాలకు బట్టలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే
SKLM: లావేరు మండలం బూడుమూరు గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్‌లో మూడు పురిల్లులో దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరామర్శించి, బట్టలు, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.