'భారతీయుల ఆత్మాభిమానమే జాతీయ జెండా'

'భారతీయుల ఆత్మాభిమానమే జాతీయ జెండా'

ELR: నూజివీడు మండలం మద్దాయికుంట జడ్పీ హైస్కూల్ ఆవరణములో త్రివర్ణ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య 148వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం దారపురెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ.. భారత జాతి ఆత్మాభిమానం, సార్వభౌమాధికారానికి జాతీయ జెండా గొప్ప చిహ్నంగా నిలుస్తుంది అన్నారు. జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావడం తెలుగు వారంతా గర్వించాలన్నారు.