'కుమ్మర్లు రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో ఎదగాలి’
BHNG: కుమ్మర్లు రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో ఎదగాలని కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడుకొండల వెంకటేశం అన్నారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్యను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వృత్తి విద్యలో నైపుణ్యాన్ని చూపిస్తూ మట్టి పాత్రలు వాడే విధంగా కృషి చేయాలని కోరారు.