సీఎం వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారు: KTR
TG: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా బుల్డోజర్ వాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సభలో సీఎం ప్రవర్తన వీధి రౌడీలా ఉందని, ఆయన చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. రేవంత్ తన భాషను మార్చుకోవాలని, అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.