న్యూ రాజరాజేశ్వరిపేటలో అధ్వానంగా రోడ్లు
NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలోని అంతర్గత సిమెంట్ రోడ్లు దాదాపు పదేళ్ల క్రితం అభివృద్ధి చేసి ప్రస్తుతం గతుకులమయంగా మారాయి. రోడ్డు ప్రారంభంలో తీవ్రంగా దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్న స్థానికులు, తక్షణమే రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.