గోమాతలను రక్షించండి

ప్రకాశం: కనిగిరి పట్టణంలో వీధి ఆవులు భారీగా సంచరిస్తున్నాయి. యజమానులు వీటి ఆలనపాలన చూడకపోవడంతో అవి రహదారులు పక్కన పడేసిన చెత్త కుండీల దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలు తింటున్నాయి. ఆవులు వీటిని తినడంతో జీర్ణమయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. మున్సిపల్ అధికారులు స్పందించి స్థానికంగా గోశాల ఏర్పాటు చేసి వీటిని రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.