విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
NGKL: వంగూరు మండలం నిజాంబాద్ గ్రామంలో శనివారం యువజన సంఘం నాయకుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు స్వాతంత్ర సమరయోధులు, శాస్త్రవేత్తల చిత్రపటాలను అందజేశారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలు పంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.