VIDEO: 'డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దు'
KNR: హుజూరాబాద్‌లో డంప్ యార్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. జనావాసాల మధ్య డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.