'అవార్డుల దరఖాస్తుల స్వీకరణ రద్దు'
PDPL: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో ఫెలిసిటేషన్- 2025 క్రిస్మస్ వేడుకల కోసం క్రైస్తవుల ఉత్తమ సేవా, ప్రతిభ అవార్డుల దరఖాస్తుల స్వీకరణను తక్షణమే రద్దుచేస్తున్నట్లు, జిల్లా ఇంఛార్జ్ మైనారిటీస్ సంక్షేమాధికారి నరేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రక్రైస్తవ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.