సర్పంచ్ బరిలో 82 ఏళ్ల వృద్ధురాలు!
TG: పెద్దపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఓ వృద్ధురాలు పోటీలో ఉంది. మంథని మండలంలోని ఉప్పట్ల గ్రామంలో మొదటి విడతలో జరిగే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాశిపేట వెంకటమ్మ 82 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్‌గా పోటీ చేయడం మంథనిలో హాట్‌టాపిక్‌గా మారింది. వయసుపైబడినా సేవా స్ఫూర్తితో ముందుకు వచ్చిన ఆమె, గ్రామాభివృద్ధే తన లక్ష్యమని చెబుతోంది.