'ఆపరేషన్ సేఫ్ స్కూల్' పేరుతో పోలీసుల మెరుపు దాడి

'ఆపరేషన్ సేఫ్ స్కూల్' పేరుతో పోలీసుల మెరుపు దాడి

HYD: స్కూళ్ల వద్ద తంబాకు విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు 'ఆపరేషన్ సేఫ్ స్కూల్' పేరుతో మెరుపు దాడులు చేశారు. సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు 5వేల మంది సిబ్బంది 500 పాన్ షాపులను తనిఖీ చేశారు. విద్యార్థులకు నికోటిన్ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు గుర్తించామని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు. రానున్న రోజుల్లోనూ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.