తోకపల్లి సమీపంలో టైరు పేలి లారీ బోల్తా

ప్రకాశం: పెద్దారవీడు మండలంలోని తోకపల్లి గ్రామ సమీపంలో అకస్మాత్తుగా టైరు పేలి స్తంభాన్ని ఢీ కొట్టి లారీ బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పెద్దారవీడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.