నేడు రాయచోటికి మంత్రి సత్య కుమార్ రాక

నేడు రాయచోటికి మంత్రి సత్య కుమార్ రాక

అన్నమయ్య: రాయచోటి టౌన్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఉదయం 10 గంటలకు 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కానుంది. దీని నిర్మాణానికి రూ.23.75 కోట్లు ఖర్చయింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ భూమిపూజ, శిలాఫలక ఆవిష్కరణ చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు మాసాపేట మార్కెట్ యార్డులో కొత్త మార్కెట్ కమిటీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది.