'CPM ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిత్య పోరాటం'
మంచిర్యాల జిల్లాలోని ప్రజా సమస్యలపై నిత్య పోరాటం చేస్తామని CPM జిల్లా కార్యదర్శి సంకే రవి తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. దేశభక్తి పేరుతో BJP అమెరికాకు దాసోహం అయిందన్నారు. ఈనెల 15న సెమినార్ నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.