రేపు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన

రేపు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన

KMM: రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్మించనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు గురువారం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుధవారం పరిశీలించారు. శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరుకానున్నట్లు చెప్పారు. తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, తదితరులున్నారు.