పరదీప్ పోర్టు డిప్యూటీ ఛైర్మన్‌గా వేణుగోపాల్

పరదీప్ పోర్టు డిప్యూటీ ఛైర్మన్‌గా వేణుగోపాల్

VSP: విశాఖ పోర్టు అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందారు. ఆయనను పరదీప్ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర పోర్టులు, నౌకా జలరవాణా శాఖ మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 1995లో విశాఖ పోర్టులో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్‌గా చేరిన ఆయన అంకితభావంతో సేవలు అందించారు.