VIDEO: పాత బస్టాండ్ ప్రారంభం
WNP: వనపర్తి పాత బస్టాండ్ ప్రజలకు సోమవారం అందుబాటులోకి వచ్చింది. మహబూబ్ నగర్ ఆర్.ఎం. సంతోష్, డీ.ఎం దేవేందర్ గౌడ్‌తో కలిసి పునః ప్రారంభించారు. కొత్త బస్టాండ్ ప్రారంభమైనప్పటి నుంచి పాత బస్టాండ్ నిరుపయోగంగా ఉండడంతో ప్రజల వినతి మేరకు వినియోగంలోకి తెచ్చినట్లు RM తెలిపారు. నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ ఉపయోగంలోకి రావడంతో ప్రయాణికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.