చెరువును పరిశీలించిన జిల్లా ఇరిగేషన్ అధికారి
SRD: ఖేడ్ మండలం మాద్వార్ తండా జీపీ గునుకులకుంట గ్రామ చెరువు ను జిల్లా ఇరిగేషన్ అధికారి కరుణ, AE నాగరాణి బృందం ఇవాళ సందర్శించి పరిశీలించారు. చెరువు సమస్యలపై గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. చెరువు తూము కట్ట, అలుగు మరమ్మతుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్ అధికారులను కోరారు.