కంకిపాడు బైపాస్ రోడ్డులో బైక్‌ దగ్ధం

కంకిపాడు బైపాస్ రోడ్డులో బైక్‌ దగ్ధం

కృష్ణా: కంకిపాడు బైపాస్ రోడ్డులో శనివారం ఓ బైక్‌కు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. విజయవాడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పటమటకు చెందిన వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.